Monday, November 15, 2010


ఒహోహోహో..
కాధలి.. కాధలి..కాధలి..
నా ప్రేమ నింగిలో మెరిసిన జాబిలి
G.forceuu లాగినట్టు.. నా ఎదనే లాగినావే..
Robinhood దోచినట్టు.. నా మదినే దోచినావే..
ఒక చిన్ని నవ్వుతోనే.. satelliteగా మార్చుకున్నావ్ నన్ను నువ్వే/నీకే......

తరాలుగా దాగి ఉన్న historyనే restart చేస్తా..
కొత్త కొత్త chaptersనే.. నా ప్రేమలో include చేస్తా..
కని విని ఎరుగని రీతిలో నీ మనసునే గెలిచేస్తా..
నీలాంటి lover లేడని.. లోకంతో అనిపిస్తా
..

ఒంటరిగా నన్ను నేను గమనించే వేళ..
వెంటాడే తుంటరి ఆలోచన నీవు..
మాటలకై అన్వేషించే వేళ..
మదిలో మెదిలే రూపం నీవు..
ఎంత వెతికినా.. ఎదురు చూసినా..
చేరువ కావు..
నీ నీరిక్షణలోనే నా నిర్వాణాన్ని వెత్తుకోమంటూ..
చిలిపిగా నవ్వి మాయమవుతావు..

మదిలో మొదలై..
ఎదలో పదిలమై..
తనువంతా ప్రవహించిన ఈ ప్రేమ..
ఆత్మ తానై..
నన్ను నిన్నుగా మార్చి..
నాకు నన్ను దూరం చేసింది నీ ప్రేమ..

Sunday, November 14, 2010


అలలుగా తెగిపడే ఆలోచనల మాటున..
కలలుగా నాలో మెదిలే గ్యాపకాల చాటున..
సవ్వడిగా మోగే నా గుండె చప్పుడులో
శ్వాసగా సాగే నా ప్రతి ఉచ్వాస నిశ్వసలలో..
అనంతమై.. అమోఘమై..
అపురూపమై.. అమృతమై..
నిలిచి ఉన్నది..
నీ రూపం .. నీ ధ్యానం..


Saturday, November 13, 2010