Tuesday, October 2, 2012

"నాన్నా!!"

"హా!!" అంటూ చేసుకుంటున్న పనిలో నుంచి బయటపడి చూశాడు తండ్రి.

"వెయ్యి రూపాయలు కావాలి నాన్న.."

"సరే.. ఇదిగో..", మళ్ళి పనిలో మునిగిపోయాడు తండ్రి..

"నాన్నా"

"హా!!"

"పది వేలు కావాలి నాన్న"

"ఊ.. పది వేలా ?? ఎందుకురా ??" అడిగాడు తండ్రి 

"కావాలి నాన్న" అన్నాడు కొడుకు

"అదే ఎందుకు??

"మొన్న అడిగినప్పుడు ఇచ్చావ్ కదా నాన్న??"

"అందుకేరా .. మళ్ళి ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా.."
మళ్ళి తండ్రే.. "ఏమైనా ఫీజు కట్టాలా??"

"అదేమీ లేదు నాన్న.. కావాలంతే. అయినా వేయి అడిగినప్పుడు ఏమి అడగకుండానే ఇచ్చావ్.. ఇప్పుడెందుకు నాన్న ఇన్ని ప్రశ్నలు.." కోపంగా అన్నాడు కొడుకు.

"అప్పుడేదో party o, gift o అనుకుని ఇచ్చరా. ఒకేసారి పదివేలు ఎందుకు నీకు??"

"అవసరముంది నాన్న"

"అదే అంత అవసరమేంటి అని అడుగుతున్నా.. నీ ప్రతి అవసరం నేను తీరుస్తుండగా పది వేలు అవసరమయే అంత   అవసరం ఎంటిరా నీకు ??"

"అంత అవసరం లేకుండా అడిగేంత వెధవనేం కాదు నాన్న"

"అంత తండ్రికి కూడా చెప్పుకోలేనంత అవసరానికి డబ్బిచ్చెంత వెధవని నేను కూడా కాదు "

 "మా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది వాళ్ళ ఇద్దరి ఇళ్ళల్లో ఇష్టం లేదు.. పెళ్లి కోసం అమ్మాయిని తిస్కోచేసాడు.. ఫ్రెండ్స్ అందరు వాడి పెళ్లి చేస్తున్నాం. అందుకే " అని కారణం చెప్పాడు కొడుకు

"సరే" డబ్బులిచ్చాడు తండ్రి.

"Thank you " నాన్న అంటూ వెళ్ళబోయాడు కొడుకు

"మరి ఉండటం ఎక్కడ", అడిగాడు తండ్రి

"ఇంకా ఎం ఆలోచించలేదు నాన్న"

"అంత అయిపోయాక ఇక్కడికే మన ఇంటికి తిస్కోని వచ్చేయ్ . మన మెడ పైన పోర్షన్ లో ఉంటారులే.. ", అన్నాడు తండ్రి

తండ్రి మాటలకి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కొడుకు..

Friday, September 28, 2012

అగరొత్తుల గుభాలింపుతో నిండిన ఆ గదిలోకి అప్పుడే అడుగు పెట్టిన ఆమెని చూడగానే తన గది తనకే కొత్తగా కనిపిస్తుంది. 
ఆమెకి అతనేమి పూర్తిగా కొత్త కాదు. 
అలా అని వాళ్ళది ప్రేమ వివాహం కాదు. 
అతని వ్యక్తిత్వం ఆమెకి, ఆమె సున్నితత్వం అతనికి ముందుగానే కాస్త పరిచయం. Modern Technology దయవల్ల. 
ఆమె అతనిని చూసి నవ్వింది. అదే పిలుపుగా భావించి అతను ఆమె వైపు కదిలాడు. 
ఆమె చేతులను తన చేతులలోకి తీసుకుంటూ ముందుకు నడిచి తమ కోసం అలంకరించి ఉన్న మంచం పై కూర్చున్నారు. 

దగ్గరగా చేరిన వాళ్ళ మధ్య ఇంకా  దూరం ఉంది. గాలి స్వేచ్చగా తిరుగుతుంది వాళ్ళ మధ్య. వాళ్ళ గుండె చప్పుళ్ళు వాళ్ళకి తెలుస్తున్నాయి.
దీర్గంగా ఊపిరి పీల్చి అతను ఆ నిశబ్దాన్ని చేదించే ప్రయత్నం చేసాడు. 
" ఏమైనా ఆలోచిస్తున్నావా?" అడిగాడు.
"హా!", అని.. అదేమీ లేదన్నట్టు తలూపుతూ అతని వైపు తిరిగిందామే.
"మీ అమ్మ నాన్నల గురించా!", మరో ప్రశ్న.
"ఆహ".. ముక్తసరిగా ముగించిందామే.
"మరి", అంటూ తన చేతిని ఆమె చేతిపై వేసి అడిగాడు.
"మన గురుంచి", అని అతని చేతిపై ఆమె చేయి వేస్తూ చెప్పింది.
"మన" అని వినగానే అతనిలో ఎప్పట్నుంచో ఉండిపోయిన ఒంటరితనం అనే భావన ఇంక తనకు లేదు అనే ధైర్యం, సంతోషం, ఆనందం, అవ్యక్తమైన అతీతమైన భావనలో అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఆమాంతం తన చేతిని దగ్గరగా తీసుకుని అతను పెదాలతో ముద్దాడాడు. 
ఆ వెచ్చదనానికి ఆమె మొహం ఎర్రబడింది. ఇద్దరు కౌగిలిలో ఒకటిగా అయ్యారు. 
నిశిధిని శశి పాలిస్తుండగా ఆమెని అతను పాలించడం ప్రారంబించాడు. 
శశి వెన్నెల కాంతులతో మెరిసిపోతున్న నింగిలా అతని ప్రేమలో ఆమె మెరిసిపోతుంది.
వాళ్ళ దగ్గర ఇంక దూరానికి చోటు లేదు. గాలి కూడా వాళ్ళ మధ్య చొరబడే సాహసం చేయలేకపోయింది. కాలం ఆ రాత్రి వాళ్ళ కోసం కాస్తంత వేగం తగ్గించుకుంది. 
వాళ్ళు మాత్రం పంచాబూతత్మకమైన ఈ లోకానికి అతీతంగా విహరిస్తూ అతను, ఆమెగా కాక అర్ధనారీశ్వరంగా మిగిలారు. 

Saturday, July 16, 2011

నీలో ప్రతి అనువు చూస్తుంటే..
నన్ను నేను మరోసారి చుసుకుంటున్నట్టే..
నీలో మెదిలే ప్రతి ఊహ..
ఈనాడో.. ఎప్పుడో నా మదిని తాకి వెళ్ళిందే..
నా శ్వాసలో చేరే ప్రతి వాయువు..
నీ శ్వాస నుంచి వెలువడినట్టే..
నేను చుసిన విదానే..
నీ చూపులు సాగగా..
ఏమనాలో మరి దీనిని ??
నా భావన.. నీ భాష్యం..
నా ఆలోచన.. నీ ఆచరణ..
నా పరవశం.. నీ ప్రాణం..
నా ప్రేమ.. నా స్వేచ్చ.. నీ సొంతం.. ♥ :)

Friday, June 3, 2011


మాటలతో కోటలు కట్టను

అవ్యక్తపు అనుబుతులు బయటపెట్టను

సానుబూతితో మనసు గెలవాలనుకోను

జాలితో ప్రేమ పెంచుకోవాలనుకోను..

నువ్వు మౌనమై ఉంటె.. కంటి చూపుని..

నువ్వు చిరాకులో ఉంటె.. పంటి బిగువుని..

ఆనందంగా ఉంటె.. చిరునవ్వుని..

ఆస్వాదిస్తనే కాని.. పొగడను..

చెలిమి పేరుతో దగ్గరయి..

ప్రేమగా మారిందని..

మొదటి చూపులోనే.. మనసు దోచావని..

చెప్పను.. వంచన చెయ్యను..

నిస్వార్ధమైన ప్రేమ..

ప్రేమను ప్రేమించిన ప్రేమ..

ప్రేమకై ప్రేమించిన ప్రేమను... ప్రేమిస్తుంది.

Monday, February 28, 2011

సాగర తీరంలో
వెన్నెల నీడల్లో
గోదావరి ఒడ్డున ఇసుక తెన్నెల్లో
ప్రకృతి ప్రతి ముద్రలో
వెతిక నీ జాడ కోసం..
తిరిగా నీ ఉనికి కోసం..

నీ నవ్వులు వినపడగానే
కెరటాల సవ్వడి నిశబ్దం వహించింది
నీ రూపం కనపడగానే
వెన్నెల మబ్బు చాటు చేరింది..
నీ అడుగులు తాకగానే
గోదావరి ఉరకలు వేసింది..

నీ స్నేహం కోసం
నీతో సాన్నిహిత్యం కోసం
ఆరాట పడింది నా హృదయం..

Monday, November 15, 2010


ఒహోహోహో..
కాధలి.. కాధలి..కాధలి..
నా ప్రేమ నింగిలో మెరిసిన జాబిలి
G.forceuu లాగినట్టు.. నా ఎదనే లాగినావే..
Robinhood దోచినట్టు.. నా మదినే దోచినావే..
ఒక చిన్ని నవ్వుతోనే.. satelliteగా మార్చుకున్నావ్ నన్ను నువ్వే/నీకే......

తరాలుగా దాగి ఉన్న historyనే restart చేస్తా..
కొత్త కొత్త chaptersనే.. నా ప్రేమలో include చేస్తా..
కని విని ఎరుగని రీతిలో నీ మనసునే గెలిచేస్తా..
నీలాంటి lover లేడని.. లోకంతో అనిపిస్తా
..

ఒంటరిగా నన్ను నేను గమనించే వేళ..
వెంటాడే తుంటరి ఆలోచన నీవు..
మాటలకై అన్వేషించే వేళ..
మదిలో మెదిలే రూపం నీవు..
ఎంత వెతికినా.. ఎదురు చూసినా..
చేరువ కావు..
నీ నీరిక్షణలోనే నా నిర్వాణాన్ని వెత్తుకోమంటూ..
చిలిపిగా నవ్వి మాయమవుతావు..