Tuesday, October 2, 2012

"నాన్నా!!"

"హా!!" అంటూ చేసుకుంటున్న పనిలో నుంచి బయటపడి చూశాడు తండ్రి.

"వెయ్యి రూపాయలు కావాలి నాన్న.."

"సరే.. ఇదిగో..", మళ్ళి పనిలో మునిగిపోయాడు తండ్రి..

"నాన్నా"

"హా!!"

"పది వేలు కావాలి నాన్న"

"ఊ.. పది వేలా ?? ఎందుకురా ??" అడిగాడు తండ్రి 

"కావాలి నాన్న" అన్నాడు కొడుకు

"అదే ఎందుకు??

"మొన్న అడిగినప్పుడు ఇచ్చావ్ కదా నాన్న??"

"అందుకేరా .. మళ్ళి ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా.."
మళ్ళి తండ్రే.. "ఏమైనా ఫీజు కట్టాలా??"

"అదేమీ లేదు నాన్న.. కావాలంతే. అయినా వేయి అడిగినప్పుడు ఏమి అడగకుండానే ఇచ్చావ్.. ఇప్పుడెందుకు నాన్న ఇన్ని ప్రశ్నలు.." కోపంగా అన్నాడు కొడుకు.

"అప్పుడేదో party o, gift o అనుకుని ఇచ్చరా. ఒకేసారి పదివేలు ఎందుకు నీకు??"

"అవసరముంది నాన్న"

"అదే అంత అవసరమేంటి అని అడుగుతున్నా.. నీ ప్రతి అవసరం నేను తీరుస్తుండగా పది వేలు అవసరమయే అంత   అవసరం ఎంటిరా నీకు ??"

"అంత అవసరం లేకుండా అడిగేంత వెధవనేం కాదు నాన్న"

"అంత తండ్రికి కూడా చెప్పుకోలేనంత అవసరానికి డబ్బిచ్చెంత వెధవని నేను కూడా కాదు "

 "మా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది వాళ్ళ ఇద్దరి ఇళ్ళల్లో ఇష్టం లేదు.. పెళ్లి కోసం అమ్మాయిని తిస్కోచేసాడు.. ఫ్రెండ్స్ అందరు వాడి పెళ్లి చేస్తున్నాం. అందుకే " అని కారణం చెప్పాడు కొడుకు

"సరే" డబ్బులిచ్చాడు తండ్రి.

"Thank you " నాన్న అంటూ వెళ్ళబోయాడు కొడుకు

"మరి ఉండటం ఎక్కడ", అడిగాడు తండ్రి

"ఇంకా ఎం ఆలోచించలేదు నాన్న"

"అంత అయిపోయాక ఇక్కడికే మన ఇంటికి తిస్కోని వచ్చేయ్ . మన మెడ పైన పోర్షన్ లో ఉంటారులే.. ", అన్నాడు తండ్రి

తండ్రి మాటలకి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కొడుకు..

No comments:

Post a Comment